తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 119 మంది MLA లు ఉంటే ఇందులో 67 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.46 మంది ఫై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి.ఈ విషయాలను 2014 నాటి ఎన్నికల అఫిడవిట్ లలో వారే స్వయంగా పేర్కొన్నారు.దీని ద్వారా ADR ఒక నివేదికను రూపొందించాయి.2014 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మందిపై క్రిమినల్ కేసు లు ఉన్నాయని,కొందరు ప్రజాప్రతినిధులు హత్య,కిడ్నాప్ కేసు ల్లో విచారణ ఎదుర్కుంటున్నారని ADR తన రిపోర్ట్ లో పేర్కొంది.ప్రస్తుతం కేసుల విచారణ ఏ స్థాయిలో ఉంది అనేది వెల్లడించలేదు.
తెరాస ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన చాలా కేసులను ఎత్తివేసింది.వాటి వివరాలను అందులో ప్రస్తావించలేదు.
