మరో 57 రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు తెలియబోతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.పలు పార్టీలకు చెందిన నేతలు హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరిన సందర్బంగా మాట్లాడిన ఆయన,మోదీ,KCR కుమ్మక్కయ్యారని ఆరోపించారు.ఉద్యమ సమయంలో KTR అమెరికాలో ఉన్నాడని,ఈ సారి ఎన్నికలు KCR కుటుంబం వర్సెస్ తెలంగాణ సమాజంగా మారాయన్నారు.
