ఎన్నికల నగారాకు నోటిఫికేషన్

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది.దీంతో సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని,నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల ఖర్చు మొదలైనట్టేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 48 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు.అన్ని రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను వారం రోజుల్లోగా అందచేయాలని స్పష్టం చేసారు.లేని పక్షంలో స్టార్ క్యాంపెయినర్ల ఎన్నికల ఖర్చులన్నీ ఆయా పార్టీలకు చెందిన స్థానిక అభ్యర్థుల ఖాతాలోకి వెళ్తాయని హెచ్చరించారు.సోమవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,తొలిరోజు సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలోని 38 నియోజకవర్గాల్లో 48 నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అధికార తెరాస అభ్యర్థులు 10 మంది ఉండగా,బీజేపీ నుంచి 9,కాంగ్రెస్ నుంచి 6,టీడీపీ నుంచి 2,సిపిఐ నుంచి 2,ఆప్ నుంచి 2,BLF నుంచి 2,సిపిఎం నుంచి 1,BSP నుంచి 1,PPI నుంచి 2,స్వతంత్రుల నుండి 11 నామినేషన్లు దాఖలయ్యాయి.

error: