సాహిత్య సామ్రాట్,రచయిత,తెలుగు యూనివర్సిటీ తొలి డాక్టరేట్ పొందిన కవి కపిలవాయి లింగమూర్తి సాహిత్య లోకం కన్నీటి వీడ్కోలు పలికింది.కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ,మృతి చెందిన ఆయనకు గురువారం నాగర్ కర్నూల్ లో అంతక్రియలు జరిగాయి.పంచాయితీ రాజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణా రావు,మాజీ MLA లు మర్రి జనార్దన్ రెడ్డి,గువ్వల బాలరాజు,తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి రాములు,ప్రజాకవి గోరెటి వెంకన్నతో పాటు పలువురు కవులు,కళాకారులు,రచయితలు నివాళులు అర్పించారు.కపిలవాయి మృతితో రాష్ట్రము గొప్ప కవిని,రచయితను కోల్పోయిందని జూపల్లి కృష్ణా రావు సంతాపం వ్యక్తం చేసారు.కవులు,రచయితలు,సాహిత్య కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.