సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రజ్ఞా గార్డెన్ లో మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.ఆయన మాట్లాడుతూ,తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు తెరాస ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను విపక్షాలు అడ్డుకుంటున్నాయి అన్నారు.ఓట్ల కోసం వస్తున్నప్రతిపక్ష అభ్యర్థులను దీనిపై నిలదీయాలని అన్నారు.కరువుతో అల్లాడుతున్న తెలంగాణకు ఈ నీరు వస్తేనే ఏడాదికి రెండు పంటలు పండి రైతు రాజు అవుతాడు అన్నారు.KCR ప్రారంభించిన పథకాలతో రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి అన్నారు.ప్రాజెక్టులు పూర్తయితే భూములు సస్యశ్యామలమై ధాన్యాగారంగా మారుతుందన్నారు.గోదావరి నీటితో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడంతో ప్రతి మహిళకు నీటి గోస తప్పిందన్నారు.ఆడపిల్లలున్న పేదకుటుంబాలకు కల్యాణ లక్ష్మి కొండంత అండగా నిలిచిందని అన్నారు.