కూటమి గెలిస్తే ప్రాజెక్టులు పూర్తి కానివ్వదు-హరీష్ రావు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ భాగస్వామిగా ఉన్న కూటమి గెలిస్తే  మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కానివ్వరు అని నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అన్నారు.తెలంగాణ అభివృద్ధి తెరాస ప్రభుత్వం తోనే సాధ్యమని చెప్పారు.తెలంగాణ భవన్లో
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ MLA అభ్యర్థి అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా కార్యదర్శి కడెంపల్లి సదానందం గౌడ్,కొడిచర్ల మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి,తెలుగు యువత మండల అధ్యక్షుడు ఎర్రవెల్లి వేణుగోపాలాచారి,SC సెల్ అధ్యక్షుడు జోగు బాలరాజు,టీడీపీ సీనియర్ నాయకుడు మక్తగూడెం బాలయ్యతో పాటు,300 మంది టీడీపీ నాయకులు,కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో తెరాస లో చేరారు.ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ,ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులు నిలిపేయాలంటూ కేంద్రానికి అనేక లేఖలు రాశారని,కూటమి అధికారంలోకి వస్తే వాటిని నిజంగానే నిలిపేయిస్తారని చెప్పారు.కాంగ్రెస్,టీడీపీ హయాం లో మహబూబ్ నగర్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు నిలిస్తే తెరాస ప్రభుత్వం నాలుగేండ్లలోనే 6.50 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చిందన్నారు.

error: