రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు తెలంగాణ సాధకులకు , తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయి అని సంగారెడ్డి లో జరిగిన ఎన్నికల ప్రచారంలో హరీష్రావు అన్నారు. తెలంగాణాకు అడ్డం పడిన చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఎలా పెట్టుకుంటుంది అని పలికారు. చంద్రబాబు కనుసన్నల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం అంతా స్వయం పాలన కోసం జరిగితే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకత్వంలో పని చేసేందుకు సిద్దపడుతోందన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాస్తా, తెలుగుదేశం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మారిందని ఎద్దేవా చేశారు. మహాకూటమి తెలంగాణ ద్రోహులు, అభివృద్ధి నిరోధకుల కూటమని మండి పడ్డారు.
వందేళ్ల చరిత్ర మాదని చెప్పుకునే కాంగ్రెస్ కు నైతిక విలువలు లేవు.
ను గెలిపించి సంగారెడ్డి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్నారు.
– సంగారెడ్డిని నాలుగేళ్ల లో ఎంతో అభివృద్ధి చేసినట్లు మంత్రి చెప్పారు.
– కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సంగారెడ్డి అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
– 15 కోట్లతో పాత సంగారెడ్డి వరకు నాలుగు వరుసల రోడ్ , బటర్ ఫ్లై లైట్స్, ఏర్పాటు చేశామన్నారు. NH-65 NH-165 ను అభివృద్ధి చేస్తున్నామని, రీజనల్ రింగ్ రోడ్ వరం కానుందన్నారు. చింతా ప్రభాకర్ కు కుడి భుజంగా ఉంటానని, సిద్దిపేట మాదిరే సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని మంత్రి హమీ ఇచ్చారు.
