తెలంగాణ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతూనే ఉంది.ఆగష్టు 15 న ప్రారంభమైన కార్యక్రమం సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,191 గ్రామాలు,మున్సిపాలిటీలు, GHMC పరిధిలో 308 వార్డుల్లో కంటి వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయింది.అంధత్వరహిత తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో 73,57,180 మందికి కంటి పరీక్షలు చేయగా,13,40,104 మందికి రీడింగ్ అద్దాలను అందచేశారు.సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 1,15,613 మందికి కంటి పరీక్షలు చేసారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో 23,580 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు GHMC కమీషనర్ దాన కిషోర్ తెలిపారు.
