తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత,ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారానికి సోమవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు.ఖమ్మం జిల్లా నుంచి నియోజక వర్గ సభలను ప్రారంభించనున్నారు.ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించినా,సోమవారం నుంచి వరుస సభలతో హోరెత్తించనున్నారు.ఆరు రోజుల్లో 31 నియోజక వర్గాల్లో సభలు పెట్టాలని నిర్ణయించారు.ఈ మేరకు ఈ నెల 25 వ తేదీ వరకు ప్రచార సభల షెడ్యూల్ ను విడుదల చేసారు.సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ లో పర్యటిస్తూ,రోజుకు ఐదారు నియోజకవర్గాల్లో సభలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసారు.ఈ రోజు మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం,పాలేరు నియోజక వర్గాలకు కలిపి ఖమ్మం పట్టణంలో ఒకే సభను నిర్వహించనున్నారు.ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.అనంతరం అక్కడి నుండి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ సభకు గులాబీ అధినేత హాజరు కానున్నారు.
