పంచాయితీల్లో రిజర్వేషన్ లు తగ్గించొద్దు-ఆర్.కృష్ణయ్య

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 22 శాతానికి తగ్గించడానికి ఎన్నికల కమిషన్,పంచాయతీ రాజ్ శాఖ చేస్తున్న ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు.గురువారం బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ,బీసీ రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 2 కోట్ల మంది బీసీ ల ఆత్మగౌరవం దెబ్బతింటుందని,స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన తరువాత బీసీ లు,మహిళల్లో నాయకత్వం పెరిగిందన్నారు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో పెట్టి జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ లు కల్పించాలని డిమాండ్ చేసారు.

error: