“పూణెలో వర్షాలు.. ఏడుగురు మృతి”
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూణె జిల్లా వ్యాప్తంగా భీకర వానలు పడ్డాయి. దీంతో పూణె నగరంలోనూ వరదలు ముంచెత్తాయి. స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ జిల్లా కలెక్టర్ నవల్ కిషోర్ రామ్ సెలవు ప్రకటించారు. పూణె సిటీతో పాటు పురందర్, బారామతి, బోర్, హవేలీ పట్టణాల్లో వర్షం హోరెత్తించింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి. కట్రాజ్ ప్రాంతంలో భారీ వర్షానికి ఓ గోడ కూలింది. సినాగద్ రోడ్డు వద్ద ఉన్న ఓ కాలువలో కారు కొట్టుకుపోయింది. దాంట్లో నుంచి ఓ మృతదేహాన్ని వెలికితీశారు. పూణె జిల్లాలో వర్షాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరుకున్నది.
