పోలీస్ స్టేషన్ లో బట్టలు విప్పి డాన్సులు

కరోనా వేళ..కొంతమంది చేస్తున్న పనుల వల్ల..ఇతరులు తల దించుకోవాల్సి వస్తుంది. వారి వృత్తికే కళంకం తెస్తున్నారు. బాధ్యత మెలగాల్సిన పోలీసులు ఓ కానిస్టేబుల్ పుట్టిన రోజు వేడుకలను పీఎస్ లోనే జరుపుకున్నారు. అంతేగాకుండా మద్యం సేవించారు. బట్టలు విప్పుకుని డ్యాన్సులు చేశారు. ఈ ఏపీ రాష్ట్రంలోని పలమనేరులో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
పలమనేరు పరిధిలో బైరెడ్డిపల్లి పీఎస్ లో పనిచేసే కానిస్టేబుల్ బలారం పుట్టిన రోజు సందర్భంగా స్టేషన్ లోనే పార్టీ చేసుకున్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కర్నాటక రాష్ట్ర మద్యాన్ని తాగుతూ..ఎంజాయ్ చేశారు. బట్టలు విప్పుకుంటూ..అర్ధనగ్నంగా డ్యాన్సులు చేశారు. కొంతమంది వాటిని స్మార్ట్ ఫోన్ లో రికార్డు చేశారు.
స్టేషన్ నుంచి అరుపులు, కేకలు వస్తుండడం స్థానికులు గమనించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. అప్పటికే వీడియో తీసిన కానిస్టేబుళ్లు..సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని పలమనేరు డీఎస్పీని ఆదేశించారు. నివేదిక ఆధారంగా…నలుగురిని వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు.

error: