మొదటి రెండు గంటల్లో రికార్డు స్థాయిలో 11.2 శాతం ఓటింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరుతున్నారు. అయితే బీజేపీ శ్రేణులు అల్లర్లకు ప్రణాళికలు రచిస్తున్నారన్న సంచారంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అన్ని పోలింగ్ బూతులదేగ్గర పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. దాంతో ఓటర్లు దైర్యంగా పోలింగ్ బూతులకి వస్తున్నారు.
ఉదయం 7గం నుండి 9గం వరకు మొదటి రెండు గంటల్లో రికార్డు స్థాయిలో 11.2 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇదే స్పీడ్ కొనసాగితే సాయంత్రం ఆరుగంటల వరకు భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మునుగోడు నియోజకవర్గం నారాయణపూర్ మండలంలోని లింగ వారి గూడెంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

error: