తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని శాపాలు పెట్టారని,కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా రాష్ట్రము దూసుకుపోతున్నది అని ముఖ్యంమత్రి కే.చంద్రశేఖర్ రావు చెప్పారు.పొరపాటున కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే కరెంటు పోతదని ప్రజలను హెచ్చరించారు.వాళ్లకు తెలివి లేదు,చెయ్యరాదు,ఆగమైపోతం.మళ్ళీ జెనరేటర్లు,ఇన్వెర్టర్లు కొనుక్కోవాలి,కొనుక్కుందామా ?అని ప్రజలను ప్రశ్నించారు.ఈ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి పరీక్ష సీఎం చెప్పారు.మోసపోతే గోసపడుతామని అన్నారు.58 యేండ్ల పాలనలో కాంగ్రెస్,17 యేండ్ల పాలనలో టీడీపీ ఏం చేశాయో,పద్నాలుగేండ్లు రాష్ట్రము కోసం కొట్లాడి,సాధించి నాలుగున్నరేండ్లలో తెరాస ఎలా అభివృద్ధి చేసిందో గమనించి,నిర్ణయం తీసుకోవాలని కోరారు.రాష్ట్రమంతటా తెరాస కు పాజిటివ్ వేవ్ కనిపిస్తున్నదని చెప్పారు.
