రికార్డ్‌ స్థాయిల్లో లాభాల స్వీకరణ

చివరి గంటలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హిందుస్తాన్‌ యూనిలివర్, ఇన్ఫోసిస్, హీరో మోటొకార్ప్‌ షేర్లలో కొనుగోళ్ల జోరుగా జరగడం కలసివచ్చింది. వరుసగా ఏడో రోజూ సెన్సెక్స్, వరుసగా నాలుగో రోజూ నిఫ్టీ రికార్డ్‌లను కొనసాగించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 112 పాయింట్ల లాభంతో 37,607 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 11,357 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,645 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,366 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఐటీ, ఇంధన, లోహ, ఫార్మా షేర్లు లాభపడగా, ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్‌ షేర్లు క్షీణించాయి. కాగా జూలై నెలలో సెన్సెక్స్‌ 6 శాతం ఎగసింది.

error: