ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాలుగున్నర సంవత్సరాల పాలనలో రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా మొత్తం యువతను తీవ్ర నిరాశలోకి నెట్టేశారని విమర్శించారు. రెండున్నర లక్షల ఖాళీలను భర్తీ చేయాల్సిన టీఆర్ఎస్ సర్కార్ గత నాలున్నర ఏండ్లలో కేవలం 11 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేశారని ఎత్తి చూపారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే, రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ప్రభుత్వ రంగంలో లక్ష ఖాళీలు భర్తీతోపాటు ప్రై వేట్ రంగంలో మరో లక్ష ఉద్యోగాలను స్వయం ఉపాధి పథకాలు ద్వారా కల్పిస్తామని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. సృష్టిస్తామని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలోగా వీటిని భర్తీ చేస్తామని వెల్లడించారు. 20,000కుపైగా ఉపాధ్యాయుల పోస్టుల పూరించడానికి ఒక మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడంతో కేసీఆర్ దిగొచ్చి భయంతో నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన ఉందని చెప్పారని ఆయన తెలిపారు. నెలవారీ భత్యం రూ.3వేలు చొప్పున 10 లక్షల మంది నిరుద్యోగులకు చెల్లిస్తామని చెప్పారు.