శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చని సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది.చట్టాలు,సమాజంలో అందరిని సమానంగా చూడాలని,పురుషులతో పోలిస్తే స్త్రీలు దేంట్లో తక్కువ కాదని సీజెఐ దీపక్ మిశ్రా చెప్పారు.ఓ వైపు స్త్రీని పూజిస్తూనే వారిని సమాన దృష్టితో చూడకపోవడం సరికాదని సూచించారు.ఈ కేసు లో 4-1 తేడాతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించింది.