సీఈవో పదవికి ఇంద్రానూయి గుడ్‌బై

పెప్సీకోకు ఇంద్రా నూయీ దూరమవుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 3న సంస్థ సీఈవో పదవి నుంచి దిగిపోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో చైర్‌పర్సన్ హోదానూ కూడా వీడనున్నారు. 12 ఏండ్లుగా పెప్సీకో సీఈవో బాధ్యతలను నిర్వర్తిస్తున్న నూయీ.. సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలను అందించారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్, బేవరేజెస్ దిగ్గజంగా పెప్సీకో ఆధిపత్యాన్ని ఇనుమడింపజేశారు. ఈ క్రమంలో 62 ఏండ్ల నూయీ ఈ అక్టోబర్ 3న తన సీఈవో పదవిని వీడనున్నారని అధికారికంగా ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది ఆరంభం వరకు చైర్‌పర్సన్ హోదాలో కొనసాగుతారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఇంద్రా నూయీ స్పందించారు. తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఈ రోజును నేను మరిచిపోలేను. భౌతికంగా సంస్థను వీడుతున్నా.. మానసికంగా నా గుండె చప్పుడు ఎప్పుడూ ఇక్కడే ప్రతిధ్వనిస్తుంది. 12 ఏండ్లుగా సంస్థ సీఈవో బాధ్యతలు నిర్వర్తించడం ఓ వైపు ఆనందంగా, మరోవైపు గర్వంగా ఉందన్న ఆమె తనతో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

error: