హైదరాబాద్ లో ఇంటెల్ సెంటర్

హైదరాబాద్ లో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ ముందుకు వచ్చింది.తొలి దశలో ౧,౫౦౦ మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వారికి,భవిష్యత్తులో మరో ౫ వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.శుక్రవారం బేగంపేటలోని క్యాంపు ఆఫీస్ లో మంత్రి KTR తో ఇంటెల్ ఇండియా చీఫ్ నివృతి రాయ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది.తెలంగాణ లో ఎలక్ట్రానిక్స్,సెమి కండక్టర్స్ మేనిఫ్యాక్చరింగ్ ఎకో సిస్టం గురించి మంత్రి తో చర్చించింది.మేక్ ఇన్ ఇండియా లో భాగంగా దేశంలో ఇంటెల్ ఉత్పత్తి రంగం విస్తరణకు అవకాశాలున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.ఇంటర్నెట్ కనెక్టివిటీ సోలుషన్స్ లో తమ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ముందుకు వచ్చారు.ఈ నెల 15 న బెంగుళూరులోని ఇంటెల్ క్యాంపస్ లో నిర్వహించనున్న సంస్థ 20 వ వార్షికోత్సవానికి హాజరు కావాలని మంత్రిని నివృతి రాయ్ ఆహ్వానించారు.

error: