అంచనాలకు అతీతం, అమూల్యం

తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇటీవల కొందరు విషం చిమ్ముతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపివేయించడానికి కొందరు అనేకసార్లు కోర్టుకు వెళ్ళారు. కానీ అనుకున్నది సాధించలేకపోయారు. దీంతో ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కన్నా, వాస్తవాలు ప్రజలకు వివరించాలనేదే నా ఉద్దేశం. గత ప్రభుత్వాల వల్ల దశాబ్దాల పాటు అన్యాయానికి గురైన లక్షలాదిమంది రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు కొత్త ఆశలు చిగురింపచేస్తున్నది.
ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవితాలను పరిపూర్ణంగా మార్పు చెందటానికి భూమికగా నిలుస్తుంది.ఈ విధంగా ప్రజల అభ్యున్నతికి భూమికగా నిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు మరేదీ ప్రత్యామ్నాయం కాదు, కాబోదు. కాబట్టి ఏ రూపంలో చూసినా.. కాళేశ్వరం ప్రాజెక్టు వెలకట్టలేని, అమూల్యమైనది.

గత పాలకులు చేసిన అన్యాయాన్ని తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిహలు కృషి చేస్తున్నది. ప్రతి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసి ప్రజలకు తొందరగా లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నది.
మన రాష్ట్రంలో సాగుకు అనుకూలమైన భూమి 75.21 లక్షల హెక్టార్లు కాగా, 22.89 హెక్టార్ల మేరకే (30.43శాతం) నీటిపారుదల సౌకర్యం ఉన్నది. 2014 జూన్ రెండవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసినప్పుడు, ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్ళ లో ఒకటి- సాగు భూమిని పెంచడం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణలో నిర్మించిన ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు పోచంపాడ్ (1964) ఒక్కటే. యాభై ఏండ్ల కాలంలో ఇది అవిభక్త నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకే వాలు ప్రవాహం (గ్రావిటీ) ద్వారా నీరందిస్తున్నది. ఈ జిల్లాల్లోని మిగతా ప్రాంతాల్లో ఎత్తిపోతల విధానం తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, మెదక్‌తోపాటు ఈ జిల్లాల్లోని ఎక్కువ భాగాలకు నీరందించవచ్చు. ఎస్‌ఆర్‌ఎస్‌పి, నిజాంసాగర్, సింగూరు, ఎఫ్‌ఎఫ్‌సి ఆయకట్టు ను కూడా స్థిరీకరించవచ్చు. తెలంగాణ భూములు గోదావరి నీటి మట్టానికన్నా 150 నుంచి 620 మీటర్ల ఎత్తులో ఉన్నందున ఈ నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా ఉపయోగించుకోకతప్పదు. ఈ ఎత్తిపోతల పథకాన్ని ఎంత పూర్తిగా ఉపయోగించుకోవచ్చనేది ఇప్పుడున్న ప్రశ్న.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఎదురైన మొదటి సవాలు ఇది. ఆరు నెలల పాటు మేధోమథనం సాగించి, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సీనియర్ నీటిపారుదల నిపుణులను సంప్రదించిన తరువాత ఈ పరిష్కారానికి రావడమైనది.
1. గోదావరి నది పొడుగునా ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు మూడు బ్యారేజీలు నిర్మించడం.
మేడిగడ్డ (కాళేశ్వరం) దగ్గర బ్యారేజీ. గోదావరి, మానేరు సంగమం దగ్గర అన్నారం బ్యారేజీ.ఎల్లంపల్లి బ్యారేజీ దిగువన సుందిల్ల బ్యారేజీ
2. వాలు ప్రవాహం కాలువలు, సొరంగాల ద్వారా నీటి సరఫరా. ఇందుకోసం మొత్తం ప్రాజెక్టు ఏడు లింకులుగా విభజన.

3. తోడుకున్న గోదావరి జలాలను సరఫరా మార్గంలోనే నిలువ చేయ డం. ఇందుకోసం సరఫరా మార్గంలో 17 జలాశయాల (స్టోరేజీలు) ప్రతిపాదన. వీటి ద్వారా 7, 38, 851 హెక్టార్ల ప్రాంతానికి నీటిపారుదల సౌకర్యం. 4. నీటి పంపిణీ వ్యవస్థ. పదమూడు జిల్లాల్లోని 38, 851 హెక్టార్ల (18, 25, 700 ఎకరాలు) ఉపయోగితా ప్రాంతానికి (కమాండ్ ఏరియా) నీటి పారుదల సౌకర్యం.
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు, ఎస్‌ఆర్‌ఎస్ వరద కాలువ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇతర మధ్య తరహా, చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో లేని ప్రాంతాలకు ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. తెలంగాణలో మిట్ట న గల నీటికొరత ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఎంతో వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్నది. సాగునీరు, ఇతర అవసరాల కోసం జలవనరుల సమ పంపిణీకి ప్రాధాన్యం ఉన్నది.
ఈ ప్రాజెక్టుకు పునరాకృతి ఇచ్చిన తరువాతనే కేంద్ర జలసంఘం అమలుకు అనుమతిచ్చింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు పొందలేకపోయింది. కానీ కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగా ప్రాజెక్టుకు పునరాకృతి ఇవ్వడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ముందుచూపు, మహారాష్ట్రతో వివాదాన్ని (తుమ్మడిహట్టి దగ్గర ఎత్తు) సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల కేం ద్రం నుంచి అనుమతులు లభించాయి. దీంతో దశలవారిగా 37.08 లక్షల ఎకరాలకు నీరందించడానికి ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి.

అరవై ఏండ్లలో తెలంగాణకు నీళ్ళు వాడుకునే హక్కును కాలరాచి అన్యా యం చేశారంటూ మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాం. తెలంగాణ సాధన కోసం పోరాడిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బంగారు నిర్మాణానికి దృఢ నిశ్చయంతో ఉన్న ది. ఈ క్రమంలో వ్యవసాయానికి నీళ్ళు అందించడం అత్యంత ప్రధా నం. నీరు జీవితంలో కొత్త ఆశలు రేకెత్తిస్తుందనేది మనందరికి తెలుసు. స్వాతం త్య్రం వచ్చి డెబ్బయి ఏండ్లయినా ఇంకా దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు సాగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం- అన్ని వసతులు కల్పించడం ద్వారా రైతుల పురోభివృద్ధి సాధించాలని, వారిని వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడేయాలని భావిస్తున్నది.
ప్రాజెక్టు వ్యయం పెరిగిందని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టు వ్యయం పెరగకుండా ఏదీ పూర్తి కాలేదు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభ అంచనా 122 కోట్ల రూపాయలు. కానీ పూర్తయేనాటికి వ్యయం 1183 కోట్లు. శ్రీరాంసాగర్ ప్రారంభ అంచనా నలభై కోట్లు అయితే పూర్తయే నాటికి వ్యయం 4,300 కోట్లకు చేరింది. వ్యయం పెరగవద్దనేది మాట్లాడినంత సులభం కాదు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే వస్తువుల ధర పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. నిర్మాణ కాలం పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంది. అందువల్ల బంగారు తెలంగాణను సాధించడానికి సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ పెద్ద ప్రాజెక్టు నిర్వహణ, నడుపడం, విద్యుత్ దృష్ట్యా ఎకరానికి ఎంత వ్యయం అవుతుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంద రు తమకు నచ్చిన రీతిలో భారీ ఖర్చు చెబుతున్నారు.
దక్షిణాది రాష్ర్టాలకు ఉత్తరాదితో గ్రిడ్ అనుసంధానం పూర్తయింది. వార్ధా నుంచి డిచ్‌పల్లికి సరఫరా నడుస్తున్నది. కాళేశ్వరం పూర్తయేనాటికి ఉత్తర భారతంలో ఉత్పత్తి అయినా జల విద్యుత్తు (వానకాలంలో కాళేశ్వరం పంపులు నడుస్తున్నాయి కనుక) రూపాయిన్నర నుంచి మూడు రూపాయల ధరకు యునిట్ చొప్పున లభిస్తుంది. ఈ లెక్కన విద్యుత్ వ్యయం తక్కువగా ఉంటుంది. యూనిట్‌కు మూడు రూపాయల చొప్పున లెక్కించినా మొత్తం వ్యయం 3, 051 కోట్లు అవుతుంది. ఎకరానికి విద్యుత్ వ్యయం 13,051 మాత్రమే. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి సాగితే ఈ వ్యయం ఇంకా తగ్గుతుంది.

ఏడాది పొడుగునా శీతోష్ణస్థితుల సమతుల్యతతో తెలంగాణ వాతావర ణం నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, నిల్వకు అనుకూలంగా ఉంటుంది. మన రాష్ట్రం ఇప్పటికే దేశంలో ఉత్పత్తవుతున్న విత్తనాల్లో 50 శాతం ఉత్పత్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలోంచే చాలా విత్తన ఉత్పత్తి కంపెనీలు తమ పరిశోధనాలయాలను, అభివృద్ధి కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాయి. తదనుగుణమైన నర్సరీలను ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే జన్యుమార్పిడి విత్తనాలను (జీఎం సీడ్స్) ఉత్పత్తి చేయటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నాయి.
ఈ మధ్యన ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అనుకూల విధానాల కారణంగా వ్యవసాయరంగ అభివృద్ధికి 37.08లక్షల ఎరాలు సాగులోకి వస్తున్నది. ఇలాంటి సానుకూల పరిస్థితుల కారణంగా తెలంగాణ ఆసియా ఖండానికి సీడ్ బౌల్‌గా మారుతుందని గట్టిగా చెప్పగలను.

ఈ నేపథ్యంలో రైతు జీవితాన్ని కాపాడేందుకు మనం ఏం చేయాలి? లక్షలాది రైతుల మొహాల్లో సంతోషాన్ని నింపేందుకు ఏం చేద్దాం? ఈ క్రమంలోంచి చూస్తే ఈ ప్రాజెక్టు నుంచి మనం ఎన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతున్నామో అర్థమవుతూనే ఉన్నది. అనుభవంలోకి వస్తూనే ఉన్నది. ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతూనే ఉన్నది.
ప్రాజెక్టుతో ప్రత్యక్ష ప్రయోజనాలు.. ప్రాజెక్టుతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. వ్యవసాయ భూమి విస్తరణ పెరుగుతుంది. పంటల దిగుబడి, ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పంటల్లో వైవిధ్యం కూడా పెరుగుతుంది. చేపల పెంపకం పెరిగి అదొక పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది. లాభాలు పండిస్తుంది. దీంతో వ్యవసాయాధారిత పరిశ్రమలు, పనులు పెరిగి గ్రామీణ జనాభాలో నిరుద్యోగ సమస్య తీరుతుంది.
పరోక్ష ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే.. వ్యవసాయ భూముల చుట్టూ, పరిసరాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. అటవీ విస్తరణకు మొదటి మెట్టుగా నిలుస్తాయి. ఈ అటవీ విస్తరణ, అభివృద్ధితో జీవ వైవిధ్యం, జీవావరణం ఎంతో సమతుల్యం సాధించి అభివృద్ధి చెందుతుంది. ఈ విధమైన అభివృద్ధి కారణంగా ఆహార భద్రతకు హామీ ఏర్పడుతుంది. పేదరికం రూపుమాపబడుతుంది. శాస్త్ర సాంకేతిక రంగా ల అభివృద్ధి ఫలాలు, పరిశోధనలు సమాజానికి వినియోగించబడి ప్రజల ఆరోగ్యం, పౌష్టికాహారం అందరికీ సొంతమవుతుంది.

ఒక మాటలో చెప్పాలంటే.. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కలల సాకారానికి రూపం. కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టే ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేస్తున్నది. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కోట్లాది ప్రజల కొనుగోలు శక్తి పెరిగి అంతిమంగా ఈ ప్రాంత అభివృద్ధికి గీటురాయిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవితాలను పరిపూర్ణంగా మార్పు చెందటానికి భూమికగా నిలుస్తుంది. ఈ విధంగా ప్రజల అభ్యున్నతికి భూమికగా నిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు మరేదీ ప్రత్యామ్నాయం కాదు, కాబోదు. కాబట్టి ఏ రూపంలో చూసి నా.. కాళేశ్వరం ప్రాజెక్టు వెలకట్టలేని, అమూల్యమైనది.
(వ్యాసకర్త: కరీంనగర్ పార్లమెంటు సభ్యులు)

error: