అక్కకు కానుక,వెండి నాణాలతో తులాభారం

మహబూబాబాద్‌ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన బొలగాని బసవనారాయణ 15 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి ఖమ్మం నగరంలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు కుమార్తె రణశ్రీ, కుమారుడు త్రివేది ఉన్నారు. కుమార్తె రణశ్రీకి గతేడాది వివాహమైంది. కుమారుడు నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో పదోతరగతి చదువుతున్నాడు. త్రివేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్‌ మనీని రూ.5 నాణేలుగా మార్చి దాచుకునే అలవాటు ఉండేది. తల్లిదండ్రులు ఎందుకు దాస్తున్నావని అడిగినా ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. వివాహానికి ముందు సోదరి అడిగినా చెప్పలేదు. పెళి తర్వాత ఆమె అత్తారింటికి వెళ్లింది. క్రమంగా త్రివేది దాచిన నాణేలతో ఒక బస్తా నిండింది. తాజాగా తల్లిదండ్రులకు నాణేల గుట్టు విప్పాడు త్రివేది. పెళ్లి తర్వాత తొలిసారి ‘రక్షాబంధన్‌’కు ఇంటికి వస్తున్న సోదరికి నాణేలను ‘తులాభారం’ ఇస్తానన్నాడు. కుమారుడి కోరికకు పొంగిపోయిన తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా వేడుక నిర్వహించాలనుకున్నారు. వేడుకకు బంధుమిత్రులకు ఆహ్వానం పంపారు. త్రివేది శుక్రవారం వారి స్వగృహంలో అక్కకు తులాభారం వేసి ఆమె బరువుకు సరపడినన రూ.5 నాణేలను కానుకగా ఇచ్చాడు. ఆమె బరువు 61 కిలోలు కాగా తులాభారంలో 11,200 వేల నాణేలు తూగాయి. అంటే వాటి విలువ అక్షరాలా రూ.56 వేలు. సోదరుడి సర్‌ప్రైజ్‌కు సోదరి, బావ ఉప్పొంగిపోయారు. వేడుకకు వచ్చిన బంధువులు వారిని ఆశీర్వదించారు.

error: