ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ డాక్టర్

– *హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డాక్టర్ ..*
– *ఇష్టానుసారంగా వ్యవరిహస్తున్న హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు..*
– *రక్త పరీక్షలు కూడా ప్రైవేట్ లాబ్ లతోనే..*
– *ఉచిత వైద్యం కొరకు వస్తున్న రోగుల జేబులు చిల్లు…*
– *ప్రభుత్వ ఆసుపత్రి లో అడిగే నాధుడు లేరు..*
– *ముగ్గురు ఎంబీబీస్ వైద్యులు,అయిదుగురు స్పెషాలిటీ వైద్యులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ వైద్యులచే విధులు…*

*సిద్దిపేట జిల్లా(ముఖ్యమంత్రి స్వంత జిల్లా)హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి హుస్నాబాద్, అక్కనపేట, కోహెడ, చిగురుమామిడి మండల కేంద్రాలకు చెందిన పెద్ద ఆసుపత్రి..30పడకల ఆసుపత్రి గా కొనసాగుతున్న ఆసుపత్రిని 50పడకల ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి లక్షారెడ్డి కోటి రూపాయలు నిధులు ప్రకటిస్తూ ప్రారంభించి రొండు సంవత్సరాల కాలం గడిచింది అయినా ఇక్కడ ఇంకా 30పడకల ఆసుపత్రికి చెందిన వైద్య సేవలే అందుతున్నాయి,జిల్లా వైద్య అధికారి పరిధిలో మొత్తం ముగ్గురు ఎంబీబీస్ వైద్యులు రెగులర్ పోస్టింగ్ లో ఉన్నారు వైద్య విధాన పర్షిత కు చెందిన మొత్తం ఎనిమిది మంది వైద్యులను నియమించిన రొండు సంవత్సరాలలో ఇక్కడి అరకొర సౌకర్యాలు నచ్చక సూపర్ స్పెషాలిటీ వైద్యులు చేసే పని లేక ముగ్గురు వైద్యులు డెప్యూటేషన్ మీద ఇతర కేంద్రాలకు వెళ్లిపోయారు ఇక మిగిలిన అయిదుగురు సూపర్ స్పెషాలిటీ వైద్యులు వారికి తగ్గట్టు గా చేసే పని లేకున్నా దగ్గు,జరం,పోయిసన్ కేసులు చేసుకుంటూ రొటేషన్ పద్దతిలో 24గంటలకు ఒక్కరు విధులు నిర్వహిస్తున్నారు..ఇక ఉన్న ముగ్గురు ఎంబీబీస్ వైద్యుల లో ఒక్కరూ అనారోగ్యంతో నెలల నుంచి విధులకు దూరం గా ఉన్నారు,ఒక్కరు అందుబాటులో ఉన్న ఇక్కడి వ్యతిగత సమస్యల సాకు తో విధులకు రావటం లేదు,ఇక ఉన్న ఒక్కరు ఇదే ఆసుపత్రి కి మెడికల్ ఆఫీసర్ గా 05 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు అయినా ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు నైట్ డ్యూటీ చేయలేదు,ఉదయం ఓపీ సేవలు 10గ.లకు అవుతే 11.00గ.లకు వస్తారు,వచ్చిన ఫీల్డ్ వర్క్ పేరు తో బయటే ఉంటారు అన్ని తానే అన్నట్టు గా వ్యవరహిస్తుంటారు హాస్పిటల్ కొరకు వచ్చే ప్రభుత్వ నిధులలో వాటాలు వేసి పంచుకుంటారు..కోస మెరుపు అసలు ఈ ఆసుపత్రి సుపురిండెంట్ గా పని చేస్తున్న వైద్యుడు డిప్యూటీ జిల్లా వైద్య అధికారి తన పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది ఎవరు ఏమి అయినా అడుగుతే నేను దళితుడిని అని చెప్పుకుంటు కాలం గడుపుతున్నారు…*

* * *పేరు కే ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఇక్కడ ఏది ఉచితం కాదు…*

*ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వారు ప్రైవేట్ దవాఖాన కి వెళ్లలేక ఆర్ధిక స్థోమత లేని వారు కేవలం ఉచిత వైద్యం కొరకు ఇక్కడికి వస్తారు కాని వచ్చాక తేలుస్తుంది అసలు ఇది ప్రభుత్వ ఆసుపత్రినే కానీ ఇక్కడ ఏది ఉచితం కాదు అని…*

*రక్త పరీక్షలకు ఇక్కడ యంత్రాలు ఉన్న పని చేయవు వాటిని బాగు చేపించారు.. ప్రైవేట్ ల్యాబ్ ల నుంచి వచ్చి రక్త,మూత్ర పరీక్ష లకు నమూనాలు తీసుకెళ్లి రిపోర్ట్ లు ఇచ్చి డబ్బులు తీసుకుంటారు…*
– *కీళ్ల నొప్పులకు కానీ ఎముకలు విరిగిన ఛాతీ లో నజ్జు వచ్చిన వైద్యులు ఎక్స్ రే పరీక్ష రాస్తారు ఇక్కడ ఎక్స్ రే మెషీన్ ఉన్న ఎక్స్ రే తీసే రాడియోగ్రాఫర్ లేకపోవడంతో మళ్ళీ బయటకు వెళ్లి ప్రైవేట్ కేంద్రాల్లో ఎక్ రే తీసుకొని రావాల్సిందే…*
– *గుండె నొప్పి లేదా ఛాతీ లో మంట వచ్చిన ఇక్కడి వైద్యులు ఇసీజీ పరీక్ష రాస్తారు కానీ అది ఆసుపత్రిలో ఉండదు మళ్ళీ బయట కే వెళ్లి తెచ్చుకోవాలి..*
– *జరం వచ్చిన వాంతులు,విరోచనాలు,బీపీ,షుగర్ తగ్గిన రోగి కి ఏమి జరిగిన మొదలు పెట్టిది ఐ.వీ క్యానుల అవి కూడా అందుబాటులో ఉండవు బయటనుంచి తెచ్చుకుంటే అప్పుడు ఇక్కడి వైద్యులు గ్లూకోస్ ఎక్కిస్తారు…*

– *దురదృష్టవశాత్తు రోగికి ఇక్కడ వైద్యం అందించలేని పరిస్థితి ఉంటే వైద్యులు రాసేది “రెఫర్ టూ హయ్యర్ సెంటర్” కరీంనగర్, సిద్దిపేట,వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళండి అని కానీ ఇక్కడ ప్రభుత్వ అంబులెన్స్ సౌకర్యం ఉండదు..అది శిథిలావస్థకు చేరి 6సంవత్సరాల కాలం గడిచింది,మళ్ళీ ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా నే రోగిని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాలకు తరిలించాల్సిన దౌర్భాగ్యం…*

** *పోస్ట్ మార్టం..***

– *హుస్నాబాద్,అక్కనపేట, కోహెడ,చిగురుమామిడి మండల కేంద్రాలలో ఆత్మహత్యలు,హత్యలు,ప్రమాదశాత్తూ కానీ ఆక్సిడెంట్ కానీ జరిగి మరణిస్తే ఇక్కడ కనీసం ఆరు వేయల రూపాయలు చెల్లించుకోవాల్సిందే..1500/-రూపాయల కు మెడికల్ సామాను,1000/రూపాయల కు సాప,ఇక మిగతాది ఆసుపత్రి సిబ్బంది కి చెలిస్తే నే..శవం కు పోస్ట్ మార్టం జరిగుతుంది ..*

– *పెద్ద ఆపరేషన్,గర్భసంచి,పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ లు జరగవు..*

– *అధికార పార్టీ అండ దండలతోనే..*

– *హుస్నాబాద్ ప్రభుత్వ అసూపత్రి వైద్యులకు అధికార పార్టీ ఆశీస్సులతోనే వైద్యులు ఇష్టానుసారంగా వ్యవరిహస్తున్నారు..అధికారంగా ప్రజా ప్రతినిధులు రివ్యూ మీటింగ్ లు పెట్టరు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తే ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెట్టి నెల్ రోజులు జరిగిన గోరంత మార్పు కూడా జరగలేదు,వైద్యుల మధ్య సమన్వయం లేక నే ఇది అంత జరుగుతుంది అని అధికారంగా ఎమ్మెల్యే గారే చెప్పారు..చెప్పిన ఎలాంటి మార్పు లేదు,కనీసం ఒక్క వాచ్ మెన్ ఉండడు,సిబ్బంది లేరు ఉన్న వారు రారు,పట్టణం లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహించుకుంటున్న ఒక్క అధికార పార్టీ కి చెందిన నాయకుడి కుమారుడు ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకున్నా ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్నారు…హుస్నాబాద్ లో ఓట్ హక్కు లేకున్నా రొండు సార్లు ప్రాంత ప్రజలు గెలిపిస్తే ప్రజలకు చేసేది ఇదా నా..?*

– *నిరసనలు,ధర్నాలు, వార్త కధనాలు ఎన్ని వచ్చిన కనీసం చలనం లేని అధికారులు,నాయకులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ…*

– *విధుల లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్పిటల్ సుపరిండెంట్,మెడికల్ ఆఫీసర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి,ఎలాంటి ఉత్తరవులు లేకున్నా ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ వైద్యుని పై చర్యలు తీసుకోవాలి వెంటనే వైద్యులను నియమించాలి,ఆసుపత్రి ని వైద్య విధాన పర్షిత లోకి మార్చాలి,ప్రభుత్వ అంబులెన్స్,ఒక్క 108,రక్త పరీక్షల యంత్రం,రేడియోగ్రఫిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్,నర్సులు,వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలి అని అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది…*

error: