విజయ్ ఇప్పటివరకు చాలా విజయాలు చూసాడు.అతనికి సక్సెస్ కొత్త కాదు.నిర్మాతకు ఇది తొలి విజయం ఐనందుకు చాలా ఆనందంగా ఉంది.మేమంతా వెనక ఉంది కేవలం సపోర్ట్ మాత్రమే చేసాం.ఈ విజయం వెనుక చాలా మంది కృషి ఉంది.టాక్సీవాలా ఘనవిజయం సాధించడం ఆనందాన్ని కలిగిస్తోంది.అన్నారు అల్లు అరవింద్.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం టాక్సీవాలా .దీనికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు.ప్రియాంకా జువాల్కర్,మాళవిక నాయర్ కథానాయికలుగా నటించారు.SKN నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది.ఈ సందర్బంగా చిత్ర బృందం హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆడియో వేదికపై ప్రేక్షకుల్ని థియోటర్లను ఫుల్ చేయమని కోరాను.నేను కోరినట్టుగానే థియేటర్లని ఫుల్ చేశారు.అందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు అని మాట్లాడారు.