అనుమానంతో వదినను నరికిన మరిది

భాణామతి చేస్తున్నారని అనుమానంతో స్వంత వదినను గొడ్డలితో నరికి చంపిన కేసులో నిందితుడిని అరెస్టు చేసిన చేర్యాల పోలీసులు

నిందితులు వివరాలు

కొమ్మిదేని చంద్రమౌళి తండ్రి కిష్టయ్య, వయస్సు 60 సంవత్సరములు, కులం మున్నూరు కాపు, గ్రామం కడవేర్గు, మండలం చేర్యాల.

మృతురాలు వివరాలు

కొమ్మినేని లక్ష్మి భర్త నాగభూషణం, వయస్సు 60 సంవత్సరములు, కులం మున్నూరు కాపు, గ్రామం కడవేర్గు, మండలం చేర్యాల.

కేసు యొక్క వివరాలు

తేదీ: 21-09-2020 ఉదయం ఫిర్యాది మరియు అతని తండ్రి ఇద్దరు కలసి వారి బంధువుల ఇంటికి కిష్టంపేట గ్రామానికి వెళ్లగా, ఫిర్యాది భార్య పిల్లలు వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా, ఇంటిలో మృతురాలు లక్ష్మి ఒంటరిగా ఉన్నది గమనించి, నిందితుడు తన కుటుంబం పై భాణామతి మంత్రాలు చేస్తున్నారని అనుమానంతో గొడ్డలితో నరికి చంపి నాడని ఫిర్యాది దరఖాస్తు ఇవ్వగా,, కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించిన చేర్యాల ఎస్ ఐ మోహన్ బాబు, చేర్యాల సిఐ శ్రీనివాస్ రెడ్డి హుస్నాబాద్ ఏసిపి మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని నేర స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా విశ్లేషణ చేశారు.

కేసు పరిశోధనలో భాగంగా చేర్యాల సి ఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ మోహన్ బాబు సిబ్బందితో కలసి నిందితున్ని పట్టుకోవడానికి గాలిస్తుండగా నిందితుడు తేదీ: 22-09-2020 రాత్రి 7 గంటల సమయమున పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగి పోయినాడు, నిందితున్ని విచారించగా మృతురాలు లక్ష్మిని గొడ్డలితో నరికి చంపిన ని నేరాన్ని అంగీకరించాడు.

ఈ సందర్భంగా ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ నిందితునికి మరియు ఫిర్యాది కుటుంబానికి గత కొన్ని సంవత్సరాల నుండి నిందితుని కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా ఉండటం లేదని ఫిర్యాది కుటుంబం సభ్యులు భాణామతి మంత్రాలు చేసి చేస్తున్నారని అనుమానంతో, మరింత కక్ష పెంచుకున్న నిందితుడు మృతురాలు లక్ష్మిని చంపాలని నిర్ణయించుకొని తేదీ; 21-09-2020 ఉదయం 11 గంటల నుండి తన సైకిల్ కు గొడ్డలి పెట్టుకొని లక్ష్మిని చంపుటకు ప్రయత్నించగా సరైన సమయం దొరకనందున మధ్యాహ్నం 3 గంటల సమయమున ఫిర్యాది ఇంటిలో ఎవరిది లేనిది చూసి, తన వెంట ఉన్న గొడ్డలి తీసుకుని వెళ్లి మృతురాలి మెడపై నరికి చంపి, అక్కడ నుండి పారిపోయినాడు. నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుల వద్ద నుండి మృతురాలు లక్ష్మిని చంపడానికి ఉపయోగించిన గొడ్డలిని కేసు పరిశోధన అధికారి సీఐ శ్రీనివాస్ రెడ్డి స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్ కు పంపిస్తున్నట్లు ఏసిపి గారు తెలిపారు. లక్ష్మి హత్య కేసును త్వరగా ఛేదించేందుకు సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ మోహన్ బాబు, మరియు సిబ్బందిని ఏసిపి గారు అభినందించారు.

ఈ సందర్భంగా ఏసిపి గారు మాట్లాడుతూ మంత్రాలు తంత్రాలు భాణామతి అనే మూఢనమ్మకాలు నమ్మవద్దని ఎవరి మీదనైనా అనుమానం ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలపాలని, లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని, ప్రజలకు సూచించారు. అనుమానంతో కక్ష పెంచుకుని కొట్లాటలు, హత్యలు, చేసే సంస్కృతి మంచిది కాదని తెలిపారు.

error: