అన్ని గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్

వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ను అందిస్తామని నరేంద్ర మోడీ తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2020 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.5జీ టెక్నాలజీని త్వరగా ఇండియాలో లాంచ్ చేసేందుకు ఇండస్ట్రీ లీడర్లు, స్టేక్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్ అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. టెలికాం ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్, డిజైన్, డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌కు ఇండియాను గ్లోబల్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని పిలుపునిచ్చారు. ఇండియాలో టెలికాం ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేసేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రభుత్వం లాంచ్ చేసినట్టు ప్రధాని తెలిపారు. మొబైల్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌కు మోస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌గా మన దేశం ఉందన్నారు. 5జీ టెక్నాలజీని కరెక్ట్ టైమ్‌‌‌‌‌‌‌‌కి ఇండియాలో లాంచ్ చేయడం ద్వారా లక్షలాది మంది ఇండియన్లకు సాయంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. మొబైల్ టెక్నాలజీతో కోట్లాది రూపాయల విలువైన ప్రయోజనాలను, లక్షలాది ఇండియన్లకు అందించవచ్చని చెప్పారు. మొబైల్ టెక్నాలజీ వల్లనే కరోనా మహమ్మారి సమయంలో నిరుపేదలకు తాము సాయం చేయగలిగామని గుర్తు చేసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో కూడా మొబైల్ టెక్నాలజీని వాడనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి రానున్నాయి. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో మొబైల్ టెక్నాలజీని ఎలా వాడనున్నారో పూర్తి వివరాలను మాత్రం మోడీ వెల్లడించలేదు. టెక్నాలజీ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్‌‌‌‌‌‌‌‌తో తరచూ హ్యాండ్‌‌‌‌‌‌‌‌సెట్లను, గాడ్జెట్లను మార్చే కల్చర్ మనదగ్గర ఉందని.. ఎలక్ట్రానిక్ వేస్ట్‌‌‌‌‌‌‌‌ను మెరుగైన విధంగా హ్యాండిల్ చేసేందుకు ఇండస్ట్రీ టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి ఆలోచించాలని మోడీ సూచించారు.

error: