అలాంటి పార్టీతో పొత్తు అనైతికమని కోదండరాం కు అనిపించడం లేదా- హరీష్ రావు

సంగారెడ్డిలో విశ్రాంత ఉద్యోగుల , ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ,

– విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం.
– కేకే ఆధ్వర్యంలోని మ్యానిఫెస్టో లో విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లను పెట్టేందుకు శాయశక్తులా కృషి చెస్తా.
– 1969 ‌ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో ను ఉద్యోగుల పాత్ర మరువలేనిది.
– కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
– హైకోర్టు, నదీ జలాలు, సచివాలయం, డైరెక్టరేట్ల వంటి కీలకమైనవి విభజించాల్సి ఉంది.
– ఇలాంటి సమయంలో రాష్టాన్ని చంద్రబాబు చేతిలో పెట్టడం ఎంత వరకు సబబు.
– కాంగ్రెస్ పార్టీ నేతలకు గెలావాలన్న కోరిక కన్నా చంద్రబాబుకు తెలంగాణలో గెల్చి పెత్తనం చేయాలన్న పట్టుదల ఉంది.
– తెలంగాణలో గెలిస్తే తాను ఆంధ్ర ప్రయోజనాలు కాపాడగలనని చంద్రబాబు భావిస్తున్నారు.
– కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారు.
– తెలంగాణ వదిలి‌వెళ్లినా అసెంబ్లీతో పాటు ఇతర భవనాలను మాత్రం తెలంగాణా కు చంద్రబాబు అప్పగించలేదు.
– భవనాలు పాడయినా తెలంగాణాకు ఇచ్చేది లేదన్న ధోరణ‌ి చంద్రబాబుది.
– తెరాసతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే కేసీఆర్ అంగీకరించలేదని చంద్రబాబే చెప్పారు.
– తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటాం.
-తెలంగాణ కు నీరు చంద్రబాబు దక్కనిస్తారా..
– కాళేశ్వరం ప్రాజెక్టు కు అడ్డం పడుతున్నారు.
– ఆంధ్రప్రదేశ్ లో‌సీట్లు, ఓట్లు ఉన్నవాళ్లు తెలంగాణ ‌ప్ర యోజనాలను కాపాడలేరు.
– నరేంద్ర మోదీ సైతం ఏపీలో చంద్రబాబు తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తీయలేదా…
– ఏడు మండలాలు, దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్ట్ ను పొత్తు పెట్టుకుని ఆంధ్ర లో సీట్లు, ఓట్ల కోసమ ఏపీకి కట్టబెట్టారు.
– ఇవాళ రాహూల్ సైతం ఆంధ్రలో ఓట్లు, సీట్ల కోసం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారు.
– కాని…తెలంగాణ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీల కోసం మాత్రం రాహుల్ మాట్లాడటం లేదు.
– తెలంగాణ లో పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లు అక్రమమని చంద్రబాబు అపెక్స్‌కమిటీలో అప్పటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశారు.
– నేను కూడా ఆ కమిటీ ముందు పోలవరం, పట్టిసీమ అక్రమ ప్రాజెక్టులని వాదించా.
– సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాజెక్టులన్నీ పాతవే అని నిరూపించారు.
– తెలంగాణ కేసీఆర్ వేలు పట్టుకుని నడవాలా, చంద్రబాబు వేలు పట్టుకుని నడవాలా
– విద్యుత్ ఉద్యోగుల విషయంలోను చంద్రబాబు కోర్టులో కేసు‌వేసి వారి జీతాలు‌ తెలంగాణ ‌చెల్లించేలా చేశారు.
– తెలంగాణ లో అధికారంలోకి రావాలని…కాంగ్రెస్ చంద్రబాబు పై నమ్మకం పెట్టుకుంది.
-తెలంగాణలో పెత్తనం చేసేందుకు కాంగ్రెస్ పై చంద్రబాబు నమ్మకం పెట్టుకున్నారు.
– తెలంగాణ పై చంద్రబాబు కు ప్రేమ లేదు.
– ప్రేమ ఉంటే తెలంగాణ కు అడ్డం పడే వాడు కాదు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసే వాడు కాదు.
– కోదండరాం పరిస్థితే విచిత్రంగా ఉంది.
– టీడీపీ తో కోదండరాం ఎలా పొత్తు పెట్టుకుంటారు.
– ఉద్యమ సమయంలో రాజీనామాలు‌ చేయని తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీ అని.. జేఏసీ నుంచి టీడీపీ ని బహిష్కరించింది కోదండరామే.
– అలాంటి పార్టీతో పొత్తు అనైతికమని కోదండరాం కు అనిపించడం లేదా అని అన్నారు.

error: