ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం,ఇక విదేశీ పెట్టుబడులు అన్నీ ఏపీకే

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో చైనాలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టిన సంస్థలు తమ కంపెనీలను ఇతర దేశాల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో అధికశాతం కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా విదేశీ పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో ఎనిమిది మంది అధికారులతో కూడిన కమిటీని నియమించింది.

ఈ కమిటీలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇంధన, ఐటీ శాఖ కార్యదర్శులు శ్రీకాంత్, కొనశశిధర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఈడీబి సీఈఓ సుబ్రహ్మణ్యంలు సభ్యులుగా ఉండనున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో చైనా నుంచి భారత్‌కు తరలి వచ్చేందుకు ప్రయత్నాలు చేసున్న వివిధ దేశాల పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా టాస్క్ ఫోర్స్ కమిటీకి బాధ్యతలు అప్పగించనున్నారు.

error: