ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ గూటికి ?

తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిసింది. రాహుల్ ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా ఇప్పటికే రెండుసార్లు కృష్ణయ్యతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెనుకబడిన కులాలు వారితోపాటు తెలంగాణలోని బీసీ,ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన
విద్యార్థుల్లో కృష్ణయ్యకు మంటిపట్టుంది. కృష్ణయ్య చాలా ఎళ్లనుండి బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. కృష్ణయ్యను కాంగ్రెస్‌లో చేర్చుకోవటం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన కులాల వారి మద్దతు సంపాదించవచ్చునని రాహుల్ యోచిస్తున్నట్లు తెలిసింది. కుంతియా త్వరలోనే కృష్ణయ్యతో సమావేశమై పార్టీలో చేరటం గురించి చర్చలు జరుపుతారనీ, ఇది జరిగిన అనంతరం కృష్ణయ్యను ఢిల్లీకి రప్పించి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే ప్రక్రియ చేపడతారనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో పూర్వవైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్న రాహుల్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన కులాల వారికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

error: