పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను అహ్మదాబాద్‌లోని సోలా ఆస్పత్రికి తరలించారు. విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో పటేళ్లకు రిజర్వేషన్ కోరుతూ హార్ధిక్ 15 రోజుల క్రితం నిరాహారదీక్ష చేపట్టారు. పదిహేను రోజులు కావడంతో ఆయన బాగా నీరసించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హార్ధిక్ బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. పటేళ్లకు కోటాతో పాటు రైతు రుణాల మాఫీ వంటి పలు డిమాండ్లను పటేల్ ముందుకు తెచ్చారు. ఈ డిమాండ్లకు కాంగ్రెస్ సహా విపక్షాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది.