ఇదేనా పరిశుభ్రత… ఇదేం పరిస్థితి-హరీష్ రావు

– ఇదేనా పరిశుభ్రత… ఇదేం పరిస్థితి…

– రోడ్డు పై వర్షపు నీరు నిలవటం పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరిశ్ రావు గారు…

– పట్టణంలో కిలో మీటరు పైన నడుస్తూ… పరిశీలిస్తూ..అసంతృప్తి వ్యక్తం చేసిన హరిశ్ రావు గారు..

సిద్దిపేట అంటే స్వచ్ఛతకు..పరిశుభ్రతకు మారు పేరు అలాంటి సిద్దిపేట పట్టణం లో రోడ్డు పై వర్షం నీరు నిలుస్తే కనపడటం లేదా.. ఒక వైపు వైరల్ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు అని మంత్రి హరీష్ రావు పట్టణము లో రోడ్డు పై నిలిచిన వర్షపు నీటి ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.. పట్టణంలో ని సీతా రామంజనేయ థియేటర్ నుండి పాత బస్టాండ్ వరకు నిలిచిన నీరుని చూసి కారులో నుండి దిగారు..చైర్మన్ గారు ఇదేం పరిస్థితి.. మునిసిపాలిటీ అధికారులు ఎం చేస్తున్నట్టు.. రోడ్డు పై నీరు…మోరిలో మురికి నీరు ఇదేనా మన పరిశుభ్రత..స్వచ్ఛ సిద్దిపేట ఇదేనా అని అసంతృప్తి… ఆగ్రహం వ్యక్తం చేశారు… పట్టణంలో నీరు నిల్వకుండా చర్యలు చెపట్టాలి అని ఆదేశించారు..ప్రధాన రహదారి పై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.. కిలోమీటరు పైగా నడుచుకుంటూ పరిశీలించారు.. వర్షపు నీరు, మురికి నీరు నిల్వకుండా వెంటనే చర్యలు చేపట్టి నీటి నిల్వకుండా చూసే విధంగా పలు సూచనల చేశారు..

చెత్త కనపడటం లేదా…

రంగదాంపల్లి చౌరస్తా వద్ద ఉన్న వైన్ షాప్, దాబా వద్ద చెత్తను గమించిన హరిశ్ రావు గారు కారులో నుండి దిగి వైన్ షాప్, దాబా యజమానిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు…చెత్త ,ప్లాస్టిక్ కనపడటం లేదా…వైన్ షాప్ , దాబా ముందు చెత్త వేస్తే సీజ్ చేయాలి అని ఏసీపీ రామేశ్వర్ ని ఆదేశించారు.. మేము స్వచ్ఛత పై, ప్లాస్టిక్ నిషేదం , చెత్త నివారణ వైపు ప్రయత్నం చేస్తుంటే మీరు రోడ్డు పై చెత్త వేస్తారా అని యజమానిపై సీరియస్ అయ్యారు… చెత్త , ప్లాస్టిక్ రోడ్డు పై కనపడొద్దు.. పరిశుభ్రత మన అందరి బాధ్యత అని చెప్పారు .

error: