ఊరి మధ్యలో చేతబడి

హుజూర్ నగర్ లో నలుగురు యువకులు చేతబడి నేర్చుకుంటూ సంచలనం సృష్టించారు… గోవిందాపురంలో స్థానికంగా ఉండే నలుగురు యువకులు అర్ధరాత్రి స్మశాన వాటికలో చేతబడి చేస్తున్నారు…అదే సమయంలో అటు వైపునకు వెళ్లే మనుషులకు స్మశాన వాటిక నుంచి ఏవో మనుషుల అరుపులు వినిపిస్తుంటే అనుమానం వచ్చి అటువైపు వెళ్ళగా నలుగురు యువకులు అక్కడ కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ కనిపించారు.. వెంటనే సదరు వ్యక్తి భయాందోళనకు లోనయ్యి స్థానికులకు ఫోన్ లో సమాచారం అందించగా వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు చేతబడి చేస్తున్న యువకులను పట్టుకొని నిలదీయాగా ఇంట్లో సమస్యలు తొలిగి పోవటానికి ఇలా చేస్తున్నామని చెప్పారు…కానీ వీళ్ళు చెప్పిన విషయాలు నమ్మదగిన విధంగా అనిపించక పెద్ద మనుషులతో కలిసి చేతబడి చేసిన ప్రదేశానికి వెళ్ళగా విస్తుబోయే విషయాలు బయట పడ్డాయి.
ఆ నలుగురు యువకుల్లో ఇట్టి రాము అనే వ్యక్తి అత్తగారి ఫోటో ఒక అమ్మాయి ఫోటో రెండు కోళ్లు పసుపు ముద్దలు పెట్టీ ఎవరో ఫోన్లో మంత్రాలు చదివితే వీళ్ళు కూడా ఆ ఫోటోల పై పసుపు వేస్తూ రెండు కోళ్లను బలిచ్చామని ఒప్పుకున్నారు.

error: