ఎస్‌బీఐ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ ?

ఎస్‌బీఐ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారుల నుంచి వేల కోట్ల మేర జరిమానాను వసూలు చేశాయని వస్తున్న వార్తలపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. నెలవారీ నిర్వహించే కనీసం బ్యాలెన్స్‌లను ఏప్రిల్‌ నుంచి తాము 40 శాతం తగ్గించామని పేర్కొంది. అంతేకాక 40 శాతం సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లను ఈ నిబంధనల నుంచి మినహాయించామని వెల్లడించింది. కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేకపోవడంపై విధించే ఛార్జీలు, ఇండస్ట్రీలోనే తమవే అత్యంత తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఎస్‌బీఐ భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వస్తున్న రిపోర్టులపై బ్యాంక్‌ ఈ ప్రకటన చేసింది. ఎస్‌బీఐ ఆ నిబంధనల కింద నాలుగు కేటగిరీల్లో బ్రాంచులను క్లాసిఫై చేసింది. రూరల్‌, సెమీ-అర్బన్‌, అర్బన్‌, మెట్రో. బ్రాంచు ఉండే ప్రాంతం బట్టి సగటు నెలవారీ నిల్వలు బ్యాంక్‌ అకౌంట్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కస్టమర్‌ కనుక ఈ నిల్వలను నిర్వహించలేని పక్షంలో, జరిమానాలను ఎదుర్కొనాల్సి వస్తుంది.


మెట్రో – రూ.3000


అర్బన్‌ – రూ.3000


సెమీ-అర్బన్‌  – రూ.2000


రూరల్‌ – రూ.1000


 

error: