తెలంగాణాలో వచ్చే ఐదు రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది.సాధారణ దాని కంటే నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని సూచించింది.ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్టంగా 34.2 డిగ్రీలు ,కనిష్టంగా 20.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంది.హైదరాబాద్ లో అక్టోబర్ 18 నాటికి గాలిలో 97% తేమ ఉండగా,సోమవారం తేమశాతం 42కు పడిపోయిందని తెలిపింది.