ఒక అబద్దం ,కుటుంబ పరువు , ఒక ప్రాణం …

ఒక అబద్దం….ప్రాణం పోయేలా చేసింది..
అందుకే అబద్దం అడవద్దు..ఒక అబద్దం నిజం అని చెప్పడానికి వంద అబద్దాలు ఆడాల్సి వస్తుంది..పాపం ఘట్కేసర్ సంఘటనలో తల్లిదండ్రులకు భయపడి..కిడ్నాప్ డ్రామా ఆడి.. దొరికిపోయిన యువతి..చివరకు..చేసిన తప్పును దిగమింగలేక.. ఆత్మహత్య చేసుకుని అసువులు బాసింది..ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతిని రక్షించి కేసును లోతుగా దర్యాప్తు చేయగా…కిడ్నాప్ డ్రామా విషయం వెలుగుచూసింది.

ఈ నెల 10న సాయంత్రం వేళ…తనను ఎవరో కిడ్నాప్ చేశారని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తల్లి 100 నంబర్‌కు కాల్ చేయడంతో పోలీసులు తక్షణం రంగంలోకి దిగారు. యువతి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యువతి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాలేజీ నుంచి షేర్ ఆటోలో ఇంటికి వస్తున్న తనను నలుగురు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం జరిపారని యువతి ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే యువతి, ఆటోడ్రైవర్ల మాటలకు పొంతన కుదరకపోవడంతో..మరింత లోతుగా సీసీటీవీలు పరిశీలించారు పోలీసులు. ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేశారని చెప్పే సమయంలో యువతి…స్నేహితునితో కలిసి బైక్‌పై వెళ్తున్నట్టు సీసీటీవీలో రికార్డయింది. ఆ దృశ్యాల ఆధారంగా యువతిని గట్టిగా ప్రశ్నించగా…ఇంటికి వెళ్లడం ఆలస్యం కావడంతో తల్లి తిడుతుందన్న భయంతో..కిడ్నాప్ డ్రామా ఆడానని యువతి అంగీకరించింది.
కిడ్నాప్ డ్రామాగా తేలడంతో యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినట్టు తెలుస్తోంది.
తన మూలంగా కుటుంబం పరువు కూడా పోయిందని యువతి ఆవేదన చెందింది. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు యువతిపై కేసు నమోదయింది.

error: