కరుణానిధికి నివాళులర్పించిన ప్రధాని

ఈ ఉదయం చెన్నై చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ,  అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించారు. ..

రాజాజీ హాల్‌కు వెళ్లి అక్కడ కరుణ పార్థివదేహానికి అంజలి ఘటించారు. ఆ తర్వాత స్టాలిన్‌, కనిమొళిని పరామర్శించారు.  ‘భారత రాజకీయ నాయకుల్లో అత్యంత సీనియర్‌ నేత కరుణానిధి. ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆలోచనాపరుడు, మాస్‌ లీడర్‌, గొప్ప రచయితను మనం కోల్పోయాం. ప్రజల సంక్షేమం కోసమే ఆయన తన జీవితాన్ని అంకింతం చేశారు. ప్రాంతీయ అభివృద్ధి కోసమే కాకుండా జాతీయ పురోగతి కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారు. తమిళుల సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నారు. తమిళుల గొంతును సమర్థంగా వినిపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పలు సందర్భాల్లో కలుసుకునే అవకాశం నాకు కలిగింది. ప్రజాస్వామ్య ఆదర్శాలకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. సాంఘిక సంక్షేమానికి ఆయన ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. తమిళనాడుతో పాటు భారత్‌ ఓ గొప్ప నేతను కోల్పోయింది’ అని మోదీ నిన్న ట్వీట్‌ చేశారు.

error: