డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఎంపీ కవిత, మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడినుంచి కరుణానిధి భౌతిక కాయం ఉంచిన రాజాజీ హాల్ కు చేరుకున్నారు. కరుణానిధి పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కరుణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ ను డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ ఎంకే స్టాలిన్ తోడ్కొని వెళ్లారు.