కరుడుగట్టిన కర్కశత్వం ,ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒకటి కాదు ,రెండు కాదు 20 ఏళ్లుగా వికృత క్రీడలు ఆడుతుంది.ఆడపిల్లల మానాలతో ఆట,మూగ జీవాల వేట,ఆ దుష్టుడికి నిత్యకృత్యం.240 ఎకరాల్లో అడవిలో అడ్డా వేసిన మానవ మృగం.అదంతా ఓ మాయలోకం,ఆ కీచకుడు అదృశ్య రూపం,అక్కడ శవాలు అదృశ్యం.పట్నం శివారులో గుట్టు చప్పుడు కాకుండా ఇన్నేళ్ళుగా రాజభోగాలు, సుజాద్ నవాబ్ కా నయా కహానీ…
హైదరాబాద్ నగర శివారులో ఓ చీకటి సామ్రాజ్యం బయట పడింది. వికారాబాద్ జిల్లా కొత్రెపల్లి పరిసరాల్లో ఓ కీచకుడి అఘాయిత్యాలు బయట పడ్డాయి.కబ్జాభూముల కోసం డొంక కదిలించేందుకు కంకణం కట్టుకున్న కలెక్టర్ కు ఖర్కశత్వపు జాడలు కంట పడ్డాయి.240 ఎకరాల వరకు ఆక్రమించుకుని 20 ఏళ్లుగా వికృతాలకు తెగబడుతున్న మానవ మృగం బయట పడింది.అతని పేరు పలకడానికి కూడా గజగజలాడేవారు అక్కడి ప్రజలు అని తెలిసింది.రేసు పందాల గుర్రాలు,కంట పడ్డ లేడి పిల్లలను తుపాకితో కాల్చుకు తినడం,కామం తలకెక్కితే ఆడపిల్లలను తీసుకురావడం,ఇవన్నీ వినడానికే భయం వేసేలా ఆ మానవ మృగం దుశ్చర్యలు ఉండేవటా.హత్యలు,అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ అతగాడి డెన్.ఈ దుర్మార్గుడికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లభ్యం కాకపోవడం గమనార్హం.
ఇన్నేళ్ళుగా అరాచకాలు జరుగుతున్న బయటపడకపోవడానికి కారణం ఏమిటి?
అధికార యంత్రాంగం ఇన్నాళ్లుగా ఎందుకు మిన్నుకుండిపోయింది?
ఇంకా ఇలాంటి చీకటి సామ్రాజ్యాలు మన రాజ్యంలో ఎన్నున్నాయో అని ఆందోళన చెందుతున్నారు సామాన్యులు…
