కారుతో సంక్షేమం…కాంగ్రెస్ తో సంక్షోభం-హరీష్ రావు

కారు గుర్తుకి ఓటేసి తెరాస ను గెలిపిస్తే సంక్షేమం వస్తది.కాంగ్రెస్ గెలిస్తే సంక్షోభం వస్తది అని హరీష్ రావు అన్నారు.మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా మదన్ రెడ్డి శనివారం నామినేషన్ వేశారు.ఈ సందర్బంగా నర్సాపూర్ లో నిర్వహించిన ర్యాలీ,రోడ్ షోలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,అభ్యర్థి మదన్ రెడ్డి,MLC భూపాల్ రెడ్డి,జడ్పీ చైర్ పర్సన్ రాజమణి మురళీయాదవ్ లతో కలిసి ప్రచారం చేసారు.ప్రజలు,కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.వంద సీట్లలో గెలిచి తెరాస మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని KCR మల్లి సీఎం కానున్నారని చెప్పారు.రాష్ట్రంలో ఎక్కడ చూసిన తెరాస గెలుపుపై మెజార్టీలపైనా చర్చ జరుగుతున్నదని హరీష్ అన్నారు.దేశంలో ఎన్నడూ ఇలాంటి వాతావరణం లేదని చెప్పారు.కాంగ్రెస్ రెండంకెల సీట్లు కూడా గెలవలేదని,ఆ పార్టీ కి ప్రతిపక్ష హోదా కూడా కష్టమని అన్నారు.తాను,మదన్ రెడ్డి వచ్చి నాలుగేండ్లలో ఇక్కడ చేసిన అభివృద్ధిని చూపిస్తామని పదేండ్లు MLA గా,ఐదేండ్లు మంత్రిగా పనిచేసిన సునీత లక్ష్మా రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసారని నిలదీశారు.

error: