కాలిఫోర్నియా అతిపెద్ద కార్చిచ్చు

కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద కార్చిచ్చు అని అధికారులు తెలిపారు. గత శుక్రవారం నుంచి సుమారు 2,83,800 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వంసం చేసింది. మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు రాంచ్‌ ఫైర్‌, రివర్‌ ఫైర్‌గా రెండు చోట్ల నుంచి వ్యాపిస్తూ మంటలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు  75 ఇళ్లు కాలిబూడిదయ్యాయి.

error: