కిలాడీ లేడీ

కరోనా పేషెంట్లకు సేవేచేసేవారు ధరించే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఒక మహిళ హల్ చల్ చేసింది. పీపీఈ కిట్ ముసుగులో ఆమె ఎవరన్నది గుర్తు పట్టటానికి కొ్న్నాళ్లు పట్టింది.
కరోనా పేరు చెపితేనే జనాలు హడలిపోయి…అయిన వాళ్ళను కూడా దూరం పెడుతున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో డాక్టర్లు వాడి వదిలేసిన పీపీఈ కిట్లు ధరించి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శైలజ అనేమహిళ(43) కరోనా వార్డులో తాను డాక్టర్ నని మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పి రోగుల బంధువులతో మాట్లాడి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తోంది.
కిట్ వేసుకుని తిరగటంతో ఆమె డాక్టరే అనుకుని అందరూ నమ్మారు. కోవిడ్ బాధితులు నిద్రపోతున్నప్పుడు వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లు, పర్సులు, విలువైన వస్తువులను దొంగిలిస్తోంది. ఇటీవల కిట్ ధరించి బయటకు వెళ్తుండగా ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చి పట్టుకోటానికి ప్రయత్నించగా పారిపోయింది.
తిరిగి బుధవారం జులై 29న మళ్లీ కరోనా పేషెంట్ల వార్డులోకి వచ్చి పేషెంట్ల బంధువులతో మాట్లాడి తిరిగి వెళ్లిపోబోతుంటే గుర్తించిన మహిళా సిబ్బంది పట్టుకుని నిలదీశారు. ఆమె చెప్పే మాటలకు పొంతన లేకపోవటంతో మాచవరం పోలీసులకుఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు.
కాగా ఆమె కరోనా వార్డులో తిరిగింది అని తెలిసి పోలీసులు కూడా మొదట ఆమెను విచారించేందకు భయపడ్డారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. తాను భర్త సత్యనారాయణతో కలిసి ప్రసాదంపాడులో నివాసం ఉంటున్ననాని చెప్పింది.
BAMS చదివానని, ఆయుర్వేద వైద్యురాలినని పేర్కోంది. ప్రభుత్వం ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు …..ప్రభుత్వ ఆసుపత్రిలోకి అక్రమంగా ప్రవేశించడం, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈమె వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని సీఐ వినయ్ మోహన్ చెప్పారు

error: