భారత వాయేసేనకు చెందిన మరో మిగ్ 21 విమానం కుప్పకూలింది. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో ఒక్కసారిగా మిగ్ విమానం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఫైలట్, కెప్టెన్, స్క్వాడ్రన్ లీడర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. విమానం కూలిపోగానే పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. దీంతో విమానయాన అధికారులు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని అధికారులు తెలిపారు. మిగ్ 21 కూలిపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.