నా అనుభవంల ఎంతోమంది నాయకుల్ని జూసిన. గనీ కేసీఆర్ సారు, ప్రశాంత్‌రెడ్డి అసుంటి మంచి నాయకుల్ని సూడలె. కేసీఆర్ లెక్క రైతులకు కరంటిచ్చిన మొనగాడు ఎవరున్నరు. గిసుంటోళ్లను మనం కాపాడుకోవాలే.. అని శతాధిక వృద్ధుడు దేవన్న తన మనోగతం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని వన్నెల్ బి గ్రామానికి చెందిన దేవన్న హాజరయ్యారు. వయసు భారాన్ని లెక్క చేయకుండా బీఆర్ఎస్ మీద ఉన్న అభిమానంతో చేతికర్రను ఊతం చేసుకొని సమ్మేళనానికి వచ్చారు. కార్యక్రమం కొనసాగుతుండగా, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. నడవడమే ఇబ్బందిగా ఉన్న దేవయ్య అలా అడిగే సరికి.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వేదిక దిగి వచ్చి ఆయనను స్వయంగా పైకి తీసుకెళ్లారు.
తానే మైకు పట్టుకొని మాట్లాడమని కోరగా దేవయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన అనుభవాలను దేవన్న వివరిస్తూ కార్యకర్తలకు కర్తవ్యబోధ చేశారు. ‘ఓట్లప్పుడు అచ్చేటోళ్లు ఎంతో మందిని జూసిన.. గని గిట్ల దినాం మన కోసం ఏదన్న పని జేసి పెట్టుడు.. గిట్ల గింతగానం సౌలత్లు జేసుడు గీ ప్రశాంత్రెడ్డితోనే జూత్తున్న. గీళ్లకంటే ముందటోళ్ల దగ్గరికి పనివడి పోతె కాల్ల సెప్పులరిగే దాకా తిప్పుతుండ్రి గని పని జెయ్యక పోతుండ్రి. గిప్పుడు మన దగ్గరికే అచ్చి ప్రశాంత్‌రెడ్డి పని జేత్తుండు. కేసీఆర్ లెక్క రైతులకు కరంటు ఇచ్చిన మొనగాడు ఎవరున్నరు. ఎండ కాలంల సుక సెర్వుల్లల్ల నీళ్లుంటున్నయంటే గి ప్రశాంత్‌రెడ్డి కష్టమే గద సుమా. మల్ల సుక ప్రశాంత్రెడ్డికే ఓటెయ్యాలె.. గెలిపిచ్చుకోవాలె’ అని దేవయ్య అనడంతో చప్పట్లు మార్మోగాయి.