వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు తెరాస పార్టీని భ్రష్టు పట్టించారని కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.వారు పార్టీని వీడడంతో తెరాస కు పట్టిన దరిద్రం కూడా పోయిందన్న ఆయన కొండా దంపతులు కాంగ్రెస్ లోకి వెళ్లడం అందరికి సంతోషాన్ని ఇచ్చిందన్నారు.గెలిచే దమ్ములేకే పరకాలకు పారిపోయారని,పార్టీ ఎప్పుడు మారిన ప్రజలు వారి వెంటే ఉంటారనుకోవడం మూర్ఖత్వం అని ఆయన అన్నారు.
