కోనాయపల్లి నుంచే ముందస్తుకు శ్రీకారం

ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను బుధవారమే పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం శాసనసభ రద్దయితే 119 మంది శాసనసభ్యులు పదవులు కోల్పోతారు. సీఎం, మంత్రిమండలి ఆపధర్మ ప్రభుత్వంలో యథావిధిగా కొనసాగనుంది.

సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లిలో పూజ చేసిన తర్వాతనే ఏ పని అయినా ప్రారంభించడం కేసీఆర్‌కు అలవాటు. రాజకీయంగా చేసే ప్రతి పనినీ ఆ గుడిలో పూజ చేశాకే ప్రారంభిస్తారు. మొదటిసారి ఎమ్మెల్యే కావడానికి ముందు నుంచీ కేసీఆర్‌కు ఇదే సెంటిమెంటు ఉంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి ముందు కూడా ఈ గుడిలో పూజ చేశాకే కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. 2009లో ఆమరణ దీక్ష సందర్భంగానూ ఇదే గుడిలో పూజలు చేసి దీక్షాస్థలికి చేరుకున్నారు.

ఒకేరోజు 2–3 సభలు నిర్వహించేలా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. సభల నిర్వహణపై 24 గంటల్లోగా సమాచారం ఇవ్వాలని మంత్రులు, సీనియర్‌ నేతలను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల ముఖ్యులు, మంత్రులతో సభల విషయం చర్చించినట్లు తెలిసింది. ఈ నెలాఖరుకల్లా 20కిపైగా సభలకు వ్యూహరచన చేస్తున్నారు.

error: