ఖమ్మంలో టోకెన్ బాబా

 

సమస్యలతో అమాయక ప్రజల పోరాటం,,,, కాసుల కొరకు తల్లి కొడుకుల ఆరాటం,,,,,, సరికొత్త టోకెన్ బాబా అవతారం ఎక్కడ అనుకుంటున్నారా చలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం,,,,,, వినోద్ అనే వ్యక్తిధి సొంత ఊరు కొరట్లగుడెం,అతను డిగ్రీలో చదువును అటకెక్కించాడు,అతని తల్లి భర్తను వదిలి కోరట్ల గూడెం గ్రామం నుండి నేల కొండపల్లి మండల కేంద్రానికి మకాం మార్చారు, అప్పుడే మొదలైంది వాళ్ళ జీవన గమనం, ఇద్దరు కలిసి డబ్బులు సులభంగా ఎలా సంపాదించాలి ఆలోచన మొదలైంది, అమాయక ప్రజల సమస్యలను ఆసరాగా చేసుకుని టోకెన్ బాబాగా అవతారం ఎత్తాడు,,, వాల్ల మోసాలకు అవధులు లేకుండా పోయాయి,, అందినకాడికి దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు,, అసలు తల్లి కొడుకులు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని ఉందా?

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా పేద అమాయక ప్రజలకు మీకు గాలి ధూళి చేతబడి చేశారంటూ నమ్మబలుకుతు వచ్చిన వారి వద్ద నుండి డబ్బులు దోచుకోవడం మొదలుపెట్టారు,, అంతా ఇంతా కాదు ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు, ఇక్కడికి వచ్చేవారు ముందుగా టోకెన్ తీసుకోవాలి టోకెన్ ధర 150 రూపాయలు, తరువాత కొబ్బరికాయలు తీసుకోవాలి రెండు కొబ్బరికాయలు అగర్బత్తి ప్యాకెట్ పసుపు కుంకుమ 150 రూపాయలు, తర్వాత లోపలికి వెళ్ళిన తరువాత అతని పిచ్చి కేకలతో పిచ్చి మాటలతో, పోయిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ నిమ్మకాయలు ఇస్తాడు, ఒక్క నిమ్మకాయ 20 రూపాయలు, ఆయన రెండు చేతులకు ఎన్ని నిమ్మకాయలు వస్తే అన్ని నిమ్మకాయలు కవర్ లో వేస్తాడు, తర్వాత ఒక తాయాతు కడతాడు,, అనంతరం నీకు చేతబడి తియ్యాలి అంటూ అది తొందరగా తీయించుకోకపోతే నిన్ను నీ కుటుంబాన్ని బలి తీసుకుందని భయబ్రాంతులకు గురి చేస్తాడు,,, అనంతరం బయటకు వచ్చిన తర్వాత అతని తల్లి మాయలేడి కవరు విప్పి చూసి ఒక్క నిమ్మకాయకు ₹20 రూపాయలు, తాయత్తు కు 350 రూపాయలు, నరదిష్టి యంత్రానికి ఐదు వందల యాభై రూపాయలు ముక్కు పిండి మరి వసూలు చేస్తుంది ఆ టక్కులాడి,,,

error: