గంగూలీకి మళ్ళీ ఛాతిలో నొప్పి

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి గురువారం మరోమారు యాంజియోప్లాస్టీ జరిగింది. గుండె రక్తనాళాల్లో ఏర్పడిన రెండు పూడికలకు స్టెంట్లు వేసినట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నాయి. ‘గంగూలీ గుండె రక్తనాళాల్లో పూడికలు తొలగించేందుకు రెండు స్టెంట్లు అమర్చాం’ అని వైద్యులు వెల్లడించారు. ఈ నెల ఆరంభంలో గుండెనొప్పికి గురైన దాదా.. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో బుధవారం మళ్లీ దవాఖానలో చేరాడు. పరీక్షల అనంతరం ఫలితాలను విశ్లేషించిన వైద్య బృందం మరో రెండు స్టెంట్లు వేసింది. గతంలో యాంజియోప్లాస్టీ నిర్వహించిన సమయంలోనే ధమనుల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. ఒక్క స్టెంట్‌ మాత్రమే వేశారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి మిగిలిన రెండు స్టెంట్లు తర్వాత వేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు మరోసారి ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఆ రెండింటిని వేశారు. కాగా.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం గంగూలీ చికిత్స పొందుతున్న దవాఖానకు వెళ్లి దాదా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

error: