మెదక్ జిల్లా రామాయంపల్లి వద్ద రూ. 98 కోట్లతో నిర్మించే రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ కేంద్రంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2006లో రైల్వే లైన్ మంజూరయ్యిందన్నారు. 8 ఏళ్లు ఒక్క అడుగు కూడా పడలేదని, నాటి ముఖ్యమంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, ఇక్కడున్న గీతారెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు.
మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను కలిపే ముఖ్యమైన మార్గమన్నారు.ఆనాడు రూ.600 కోట్లున్న ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.1160 కోట్లకు పెరిగిందన్నారు.