హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణ గ్రూప్- 2 జవాబు పాత్రల మూల్యాంకనం ప్రక్రియను TSPSC చేపట్టింది.ఈ మేరకు ఆదివారం తుది కీ ని విడుదల చేయనున్నట్లు TSPSC పేర్కొంది.తొలగించిన 19 ప్రశ్నలు రాసేందుకు ప్రయత్నించినా అభ్యర్థులకు మార్కులు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ‘కీ’ని రూపొందించినట్లు వివరించింది.
