చిటారుకొమ్మన చిరుత

దాన్ని ఎవరు చూడలేదు,ఎవరు గమనించలేదు ఎప్పుడు వచ్చిందో కానీ పొడవాటి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది…ఏంటి అనుకుంటున్నారా ?
చిరుత…చిరుత చెట్టెక్కడం ఏంటి అనుకుంటున్నారా అవును నిజమే చిరుతే చెట్టెక్కి కూర్చుంది ఓ చిటారు కొమ్మన.కొమ్మలు తప్ప ఆకులు లేని చెట్టుపై ఉన్న చిరుతను చూసిన యువకులు భయపడ్డారు.ఈ ఘటన ములుగు జిల్లాలో వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో జరిగింది.సోమవారం కొందరు యువకులు అడవిలోకి వెళ్లగా చెట్టుపై చిరుత కనిపించింది.భయపడిపోయిన యువకులు పరుగులు తీశారు.సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చెట్టుపై ఉన్న చిరుతను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియా లో షేర్ చేయడం ఈ వీడియో వైరల్ అయింది.కాగా,చిరుత సంచరించిన ప్రదేశంలో కెమెరా ట్రాప్ ను ఏర్పాటు చేశామని ములుగు డీఎఫ్ఓ ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు

error: