ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్

ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.సుక్మా జిల్లాలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన రెండు వేరు వేరు ఎన్కౌంటర్లలో తొమ్మిది మంది నక్సల్స్ మృతి చెందారు.ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా అసువులు బాశారు.తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న కిష్టారం,చింతగుఫ ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్లు జరిగినట్లు ఛత్తీస్గఢ్ స్పెషల్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు.మావోయిస్టులను ఏరివేసేందుకు సుక్మా జిల్లాలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్,సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్,స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా భద్రతా బలగాలు,తెలంగాణ పోలీస్లు 1200 మంది సిబ్బందితో సంయుక్తంగా ‘ఆపరేషన్ ప్రహార్’పేరిట కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.ఈ క్రమంలో కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకలేరు అటవీ ప్రాంతానికి బలగాలు చేరగానే మావోయిస్టులు మెరుపు దాడి చేసారు.వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి.ఇరు వర్గాల మధ్య సుమారు 40 నిమిషాల పాటు భీకర పోరు సాగింది.కొంతసేపటి తరువాత జవాన్ల దాటికి తాళలేక మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలో కాల్పులు జరుపుతూ పరారయ్యారు.

error: